లూలూ మాల్స్ .. దుబాయ్ షాపింగ్‌కు కొత్త లగ్జరీ నేర్పిన గ్రూప్. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల కోట్లతో వైజాగ్ లో అతి పెద్ద మాల్, కన్వెన్షన్ సెంటర్ కట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. పనులు ప్రారంభించారు. కానీ జగన్ రెడ్డి రాగానే తరిమేశారు. దాంతో ఇక ఏపీ వైపు చూడబోమని లూలూ సంస్థ ఓపెన్ గా ప్రకటించింది. హైదరాబాద్, కేరళ , గుజరాత్, యూపీల్లో భారీ మాల్స్ ను నిర్మించారు. ఇప్పుడు మళ్లీ ఏపీకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న భరోసాతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లూలూ మాల్ యజమానికి యూసఫ్ అలీ అంగీకరించారు. తన కంపెనీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన చంద్రబాబును కలిశారు. వైజాగ్, విజయవాడ, తిరుపతిల్లో లూలూ మాల్స్ , మల్టిప్లెక్స్ లు కట్టే అంశంపై చర్చంచారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన ప్రణాళికలపై చర్చించామని చంద్రబాబు తెలిపారు.
లూలూ మాల్స్ అత్యంత విజయవంతమైనవి. ఎక్కువగా ఉపాధి లభించే వ్యాపారాలు వీరు చేస్తారు. గతంలో లూలూ మాల్ ను కొనసాగించి ఉంటే.. వైజాగ్‌లో ప్రపంచస్థాయి కన్వెన్షన్ సెంటర్, మాల్ అందుబాటులోకి వచ్చి ఉండేది. కొన్ని వేల మందికి ఉపాధి లభించేది. ఇప్పటికీ వైజాగ్‌లో ఓ మంచి మాల్ లేకుండా పోయింది. లూలూ సంస్థ అనుకుంటే.. రెండేళ్ల్లో భారీ మాల్స్ ను రెడీ చేసేస్తుంది.