2020లోని విషాదాలు 2021లోనూ వెంటాడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. ఎన్నో సూపర్ హిట్ గీతాలు ఆయన కలం నుంచి జాలువారాయి. డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు అందించారాయన. వెన్నెలకంటి పూర్తి పేరు.. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. దాదాపు 2వేల పాటలు రాశారాయన. `మహర్షి`లోని పాటలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన రాసిన పాటలోని పంక్తి `చిరునవ్వుల వరమిస్తావా చితి నుంచి లేచొస్తా.. మరుజన్మకు కరుణిస్తావా… ఈ క్షణమే మరణిస్తా“ చాలా పాపులర్ అయ్యింది. కమల్ హాసన్ కి అత్యంత ప్రీతిపాత్రుడు. ఆయన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయితే… మాటలు – పాటలు రాసే బాధ్యత వెన్నెల కంటిదే. కుమారులు శశాంక్ వెన్నెలకంటి, రాకేందు మౌళి కూడా గీత రచయితలుగా స్థిరపడుతున్నారు.