“మా” ఎన్నికల సందర్భంగా ఏర్పడిన వివాదం ఏ మాత్రం సద్దుమణగడం లేదు. విషయం పోలీసుల వరకూ వెళ్లింది. సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వాలంటూ ప్రకాష్ రాజ్ చేసిన విజ్ఞప్తిని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తిరస్కరించిటనట్లుగా తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ లేఖ రాసిన రోజున మీడియాతో మాట్లాడిన ఆయన సీసీ టీవీ ఫుటేజీ భద్రంగా ఉందని.. ఏర్పాట్లు చేసిన వారు ఇవ్వగానే ప్రకాష్ రాజ్‌కు ఇస్తానని చెప్పారు.
అయితే సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వలేదు. ఇవ్వడానికి నిరాకరిస్తూండటంతో ప్రకాష్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సందర్భంగా తమపై దాడులు జరిగాయని ఆ దృశ్యాలు సీసీ ఫుటేజీలో ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఎన్నికలు జరిగిన జుబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లోని సీసీ టీవీ సర్వర్ రూమ్‌కు తాళం వేశారు. తదుపరి విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లడం “మా”లో సహజంగానే కలకలం రేపుతోంది.
మోహన్ బాబు, నరేష్ పోలింగ్ సందర్భంగా బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడ్డారని.. ఓట్లేసే వాళ్లని భయపెట్టారని.. కొంత మందిపై దాడులు చేశారని ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ టాలీవుడ్లో ప్రారంభమయింది.