మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలల్లో కూడా ఓటుకు నోటు మొదలైయింది. ఇప్పటికే విందు రాజకీయాలు నడిచిన ఈ ఎన్నికల్లో ఇప్పుడు నోటు రాజకీయం ఎంటరైయింది. మా ఎన్నికలని ఈ సారి ఇరు వర్గాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు వార్ హాట్ హాట్ గా నడుస్తుంది. ఇందులో ఓ వర్గం ఇప్పటికే విందులు ఇచ్చి ఓటర్లు మచ్చిక చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టారని కధనాలు వచ్చాయి. ఇప్పుడు ఓటుకు నోటు కూడా చేరింది. రెండు వర్గాల్లో ఓ వర్గం ఒక ఓటుకు దాదాపు రూ. 10 వేల ఇచ్చి ఓటుని కొనుక్కుంటుదని ఇన్ సైడ్ టాక్. ఓటర్లు చేజారిపోకుండా ఉదయం సాయంత్రం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజులు పెడుతూ .. అకౌంట్ నెంబర్లు సేకరించి నేరుగా అకౌంట్ లోకి పది వేల రూపాయిలు సెండ్ చేస్తున్నట్టు భోగట్ట.
‘మా’ లో దాదాపు 600మంది ఓటర్లు వున్నారు. ఇందులో నాలుగు వందల మంది పేరు, పరపతి వున్నవారే. మిగతా రెండు వందల మంది ఓటుకు నోటు ప్రలోభానికి లోనయ్యే అవకాశం వుందని లెక్క గట్టిన ఓ వర్గం.. వారిని సంప్రదించి ఖచ్చితంగా ఓటు తమకే వేయాలని, ఎకౌంట్ నెంబర్ అడిగి గూగుల్ పే లు చేస్తున్నారని టాక్. అలాగే హైదరాబాద్ కి దూరంగా వున్న కొంతమంది ఓటర్లని ఓటు వేయడానికి రావాల్సిందిగా కోరి వారికి పది వేలతో పాటు ప్రయాణ ఖర్చులు, వసతిని కూడా కల్పిస్తామన్నట్లుగా హామీ ఇస్తున్నారని తెలిసింది. మొత్తానికి ‘మా’ ఎన్నిక ఒక అసెంబ్లీ ఎన్నికని తలపిస్తుంది. ఓటుకు రూ. 10 వేలు అంటే మామూలు కాదు. ఈసారి ”మా’ ఎన్నిక చాలా కాస్ట్లీ అనే చెప్పాలి.