నితిన్ హీరోగా తరెకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమా దర్శకుడు ఎం.ఆర్.శేఖర్ ఇప్పటి వరకూ సైలెంట్‌గానే పని చేసుకున్నారు. కానీ సినిమా రిలీజ్ ముందు తనకు చాన్సిచ్చిన నితిన్‌ను నిండా ముంచేశాడు. అణువు అణువునా కులాహంకారంతో గతంలో ఆయన చేసిన ట్వీట్లు బయటకు వచ్చాయి. రెండు ప్రధాన కులాల్ని ఉద్దేశిస్తే మూడేళ్ల కిందట ఆయన ట్వీట్లు బయటకు వచ్చాయి. అత్యంత అసభ్యకరంగా ఆయన రెండు కులాల్ని తిట్టిపోశారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత ఎం.ఆర్.శేఖర్ అనబడే.. ఎం.రాజశేఖర్ రెడ్డి చెలరేగిపోయారు. రెండు కులాల్ని తిట్టారు.
అప్పట్లో తాను ఇండస్ట్రీలో ఇలా ఎదుగుతానని అనుకోలేదేమో కానీ ఇప్పుడా ట్వీట్లు బయటకు వచ్చాయి. అయితే ఆయన కులాభిమానం సినిమాలో కనిపిస్తోంది. రా రా రెడ్డి పేరుతో పాటలు రిలీజ్ చేశారు. ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. నితిన్ ఇప్పటి వరకూ కులాలకు పరిమితమైనట్లుగా ఎక్కడా లేదు. ఆయన వివాదాల జోలికి వెళ్లలేదు.కానీ ఆయన డైరక్టర్ ఇప్పుడు సినిమాను కులాల రొచ్చులోకి దింపారు. రెండు ప్రధాన సామాజికవర్గాలపై ఆయన కసి బయటపడటంతో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రచ్చ అవుతోంది. ఈ నెగెటివిటీ నితిన్ పై పడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇవి తన ట్వీట్లు కాదని ఎం.ఆర్.శేఖర్ అలియాస్ రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు.
కానీ ఆయనవేనని కాస్త పరిశీలనగా చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. సినిమాను సొంతంగా నిర్మిస్తున్న నితిన్ ఈ కాంట్రావర్శితో తన సినిమాకు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందోనని.. తన డైరక్టర్‌ను వెనకేసుకు వస్తున్నారు. ఫేక్ ట్వీట్లు నమ్మవద్దని కోరుతున్నారు. కానీ మాచర్ల దర్శకుడు నితిన్‌ను రెడ్లకే పరిమితం చేయడం కాకుండా.. ఆయనపై ఇతర వర్గాలు వ్యతిరేకత పెంచేలా చేశారు. ఇది నితిన్ సినిమాపై ఎఫెక్ట్ పడేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.