హీరో నితిన్ ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. అదే ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి, కేథరీన్ హీరోయిన్స్ . శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఎంఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ రోజు నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. డైలాగ్స్ ఏమీ లేకుండా కేవలం యాక్షన్ సీన్ ని చూపించారు. ఈ సీన్ షాలిడ్ గా వుంది. కత్తులు డిజైన్ చేసిన ఫైట్ సీన్ ఇది. టీజర్ కి చేసిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ఇందులో నితిన్ కలెక్టర్ పాత్ర చేస్తున్నాడు. పొలిటికల్ టచ్ వున్న కథ చేయడం నితిన్ కెరీర్ లో ఇదే తొలిసారి. అందులోనూ కలెక్టర్ పాత్రలో చేయడం కథపై ఆసక్తిని పెంచుతుంది. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. జులై8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.