ఏపీలోప్రభుత్వ ఆస్తులన్నింటికీ వైఎస్ఆర్ అనే పేరు కనిపిస్తూ ఉంటుంది. ఈ అరాచకానికి కూటమి ప్రభుత్వం పుల్ స్టాప్ పెడుతోంది. తాజాగా మచిలీపట్నం మెడికల్ కాలేజీకి వైఎస్ పేరును తీసేసి పింగళి వెంకయ్య పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ రెడ్డి ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేదు. కొన్నింటికి శంకుస్థాపన చేశాడు. పూర్తిగా కట్టిన తర్వాత అనుమతులు వస్తాయి. కానీ పెద్ద ఎత్తున అప్పులు చేసి మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.
కానీ పేర్లు మాత్రం ముందే పెట్టేసుకున్నారు. చివరికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు కూడా మార్చేసుకున్నారు. ఎందుకంటే బోలెడన్ని మెడికల్ కాలేజీలను కట్టేస్తున్నామని. ఇప్పుడు ఆ పేర్లు మొత్తాన్ని తొలగిస్తున్నారు. వరుసగా ఒక్కొక్కటిగా మారుస్తూ.. ప్రముఖుల పేర్లు పెడుతున్నారు. దేశం కోసం పోరాడిన వారి పేర్లు పెడుతున్నారు. జగన్ రెడ్డి పేర్ల పిచ్చి ఎలా ఉండేదంటే కృష్ణ జిల్లాలో ఓ మున్సిపాలిటీకి వైఎస్ఆర్ తాటిగడప అని పెట్టుకున్నారు. సెంట్ స్థలాలకు ఆయన పెట్టుకున్న పేరు వైఎస్ఆర్ జగనన్న. పోలవరానికీ అదే పేరు పెట్టుకున్నారు. కానీ చేసిందేమీ లేదు.
కడప జిల్లాకు కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఆ పేరును కూడా తొలగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తి అంటే తమ ఆస్తి అన్నట్లుగా జగన్ రెడ్డి విచ్చలవిడిగా వ్యవహరించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడ ప్రభుత్వం ఆ పేర్లను మారుస్తూ.. అబ్దుల్ కలాం నుంచి పింగళి వెంకయ్య వరకూ మహనీయుల పేర్లను పెడుతోంది.