‘మ్యాడ్ 2’ సినిమాకి ఏపీ తెలంగాణలో మంచి కలెక్షన్ వచ్చాయి. నైజాం లో కూడా మంచి నెంబర్స్ కనిపిస్తున్నాయి. మ్యాడ్ కంటే మ్యాడ్ 2 ఎక్కువ కలెక్షన్ చేస్తుందని, ఊహించని ఫిగర్లు వస్తాయని నిర్మాత నాగవంశీ కాన్ఫిడెంట్ గా వున్నారు.
నిజానికి మ్యాడ్ 2 యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమా. మ్యాడ్ సినిమాలా వినోదం అర్గానిక్ గా పండలేదు. మ్యాడ్ సినిమాకి యునానిమాస్ గా సూపర్ హిట్లు రివ్యూలు వచ్చాయి. దాదాపు సైట్లు మూడుకి పైగ రేటింగ్స్ ఇచ్చాయి. కానీ మ్యాడ్ 2కి మిశ్రమ రివ్యూలు వచ్చాయి. కామెడీ చాలా ఫోర్స్ గా వుందని, తొలి భాగంలో ఉన్నంత మజా రాలేదనే టాక్ వినిపించింది. అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద సినిమా మంచి ఫుట్ ఫాల్స్ తో రాణిస్తున్న ట్రెండ్ కనిపిస్తోంది.
దీనికి కారణం యూత్ ఫుల్ కంటెంట్. యూత్ ని టార్గెట్ గా చేసుకొని సినిమాలు తీస్తే ఓ మాదిరిగా వున్నా సేఫ్ గా బయటపడిపోవచ్చుని మ్యాడ్ 2 మరోసారి నిరూపిస్తోంది. అలాగే మ్యాడ్ కి వచ్చిన ఆదరణంగా కారణంగా మ్యాడ్ 2 పై ఒక హైప్ ఏర్పడింది. అది కూడా ఓపెనింగ్స్ కి కలిసొచ్చిందనే చెప్పాలి.