యూత్ ఫుల్ హిట్ ‘మ్యాడ్’కి కొనసాగింపుగా‘మ్యాడ్ స్క్వేర్’ వస్తోది. తొలి సినిమాలో నటించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కథానాయకులు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు సినిమా టీజర్ ని వదిలారు.
లడ్డు(విష్ణు) పెళ్లి వేడుకతో మొదలైన టీజర్ చివరి వరకు ఫన్ పటాకా లా సాగింది. కథని దాదాపు టీజర్ లోనే రిలిల్ చేశారు. లడ్డు పెళ్లికి ఇంకో మూడు రోజులు వుందనగా ఫ్రెండ్స్ రంగంలో దిగి గోవా ట్రిప్ కి వెళ్తారు. ఆ తర్వాత చోటు చేసుకున్న సరదాల సమాహారమే ‘మ్యాడ్ స్క్వేర్’.
టీజర్ లో సింగిల్ లైనర్స్ అన్నీ పేలాయి. సంగీత్ శోభన్ మరోసారి టైమింగ్ తో అదరగొట్టాడు. నార్నె నితిన్ హుషారుగా కనిపించాడు. చివర్లో భాయ్ .. బాయ్ అనే సీక్వెన్స్ నవ్వులుని రెట్టింపు చేసింది. మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకులు మందుకు వస్తోంది.