అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ నేత గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరి హత్య కేసులో ఆయన అనుచరుడు భానుకిరణ్ కు నాంపల్లి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 20 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. 2011, జనవరి 4న హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తుండగా కాల్పులు జరిగాయి. ఆ సమయంలోడ్రైవర్ తో పాటు… భానుకిరణ్ కారులో ఉన్నారు. కారు వెనుక సీటులో కూర్చున్న భానుకిరణ్ సూరిని కాల్చి చంపినట్లు సూరి కారు డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. సూరిని కాల్చి చంపిన తర్వాత 2012లో జహీరాబాద్‌లో ఉన్న భానుకిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సూరి హత్య కేసులో ఆరుగురి పేర్లను పోలీసులు చార్జిషీట్లో చేర్చారు. 92మంది సాక్ష్యులను విచారించారు. సూరితో పాటు..గన్ సమకూర్చిన మన్మోహన్ సింగ్ అనే వ్యక్తిని దోషిగా తేల్చారు. మిగతా వారిని నిర్దోషులుగా విడుదల చేశారు. సూరి హత్య కేసులో సీఐడీ అధికారులు మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారించారు. సూరి కారు డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం, భాను కిరణ్ వద్ద నుంచి సేకరించిన తుపాకికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్, హత్య కేసులో ప్రధాన నిందితుడికి, మిగిలిన నిందితులకు మధ్య హత్య ప్లాన్‌కు సంబంధించిన ఫోన్ సంభాషణల ఆధారంగా కేసు విచారణ పూర్తి చేశారు. బయటకు వస్తే.. సూరి అనుచరుల నుంచి ప్రాణహాని ఉంటుందన్న భయంతో.. భానుకిరణ్ ..బెయిల్ కోసం ఒక్క సారి కూడా.. పిటిషన్ పెట్టుకోలేదు.
మద్దెలచెర్వు సూరినికి భాను కిరణ్ నమ్మినబంటు. సూరి బినామీ. సూరి జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున సెటిల్మెంట్లు చేశారు. వ్యక్తిగత విషయాలతో పాటు కోర్టు వ్యవహారాలు, ఆస్తిపాస్తుల నిర్వహణ వంటి అన్ని విషయాలు భానునే చూసేవాడు. సూరి తన ఆస్తులు చాలావరకూ భాను పేరుమీదనే పెట్టాడు. అయితే కొన్ని ఆస్తుల వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడినట్లు బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సూరి గుర్తించాడు. భాను కిరణ్ ను అనుమానించి.. అతని పేరుపై పెట్టిన ఆస్తులన్నీ తిరిగి తీసుకుంటూండటంతోనే.. భానుకిరణ్ హత్యకు పాల్పడ్డారు.