మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు లాంటి క్లాస్ సినిమా తీశాడు రామరాజు. దర్శకుడిగా ఇదే ఆయన మొదటి సినిమా. ఆడలేదు కానీ మంచి పేరొచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు కథలా కాకుండా ఓ పొయెట్రీలా అనిపిస్తోంది మల్లెల తీరం. అద్భుతం అనిపించకపోయినా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో రామరాజు క్లాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అయితే మెగాడాటర్ నిహారికతో తీసిన ‘ఒక మనసు’ మాత్రం దారుణంగా విఫలమైయింది. క్లాస్ టచ్ కాదు కదా మరీ నీరసంగా తయారైయింది. ఎనభై దశకం ట్రీట్ మెంట్ తో పాత్రలను ఓవర్ డ్రమటైజ్ చేసి పారేశారు ఇందులో. దీంతో రిజల్ట్ కూడా నీరసంగా తయారైయింది. ఈ సినిమాకి మధుర శ్రీధర్ నిర్మాత. నష్టాల్ని చూశారు.
అయితే రామరాజుపై ఆయనకు నమ్మకం పోలేదు. ఆయన ట్యాలెంట్ పై మధుర శ్రీధర్ కి మాంచి గురి వుందేమో.. అందుకే రామరాజుతో మరో సినిమాని ప్లాన్ చేస్తున్నారు. దీనికి టైటిల్ కూడా ఖరారైపోయింది. అదే ప్రియురాలు. ఇదీ ఓ ప్రేమ కధే. స్క్రిప్ట్ వర్క్ కూడా తుది దశకు వచ్చిందట. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో కాస్త పేరున్న నటీనటులు కనిపించే అవకాశం వుందని తెలుస్తోంది.