అందరమైన అమ్మాయి .. ఓరకంటితో చూసి… చిరునవ్వు నవ్వితే ఏమవుతుంది..? .. సినిమాలో అయితే లవ్వవుతుందేమో కానీ.. నిజంగా అయితే “హనీ ట్రాప్” అవతుంది. ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటూ… విలవిల్లాడిపోవడమే కానీ.. బయటకు రాలేదు. మధ్యప్రదేశ్‌లో అదే జరిగింది. ఓ పద్దెనిమిది మంది అమ్మాయిలు ముఠాగా ఏర్పడి.. పెద్దల్ని హనీట్రాప్ చేసి.. క్విడ్ ప్రో కో చేయడం మొదలు పెట్టారు. అంటే.. ” వాళ్లకు కావాల్సింది ఇచ్చేసి.. తమకు కావాల్సింది తీసుకోవడం” ప్రారంభించారు. అయితే.. ఇక్కడ తీసుకోవడం అనేది స్వచ్చందగా జరగలేదు. వాళ్లకు కావాల్సింది ఇచ్చేసినప్పుడు.. రహస్యంగా రికార్డు చేసి.. బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్ ద్వారా తీసుకున్నారు. అక్కడే అసులు కథ ప్రారంభమయింది.
అ అమ్మాయిల వలలో పడితే విలవిల్లాడాల్సిందే..!
కొద్ది రోజుల క్రితం.. మధ్యప్రదేశ్ సెక్రటేరియట్లో పని చేసే ఓ జూనియర్ ఇంజినీర్.. ఇలా ఓ యువతి వలలో పడ్డారు. తన అందాన్ని చూసి ఆ అమ్మాయి ఆకర్షితుడయిందని అనుకున్న ఆ ఇంజినీర్.. నేరుగా… ఆమె చెప్పిన చోటకు వెళ్లారు. ఆ అమ్మాయి కూడా.. అచ్చంగా… ఆ ఇంజినీర్ అందానికి సమ్మోహితురాలు అయినట్లుగా ప్రవర్తించింది. ఆయనకు కావాల్సింది ఇచ్చేసింది. ఆ ఇంజినీర్ వెళ్లిపోయిన తర్వాత… కొద్ది రోజులకు ఓ పెన్ డ్రైవ్ పంపింది. తమ బాగోతాన్ని వాటిలో చూపించి.. రూ. మూడు కోట్లు డిమాండ్ చేసింది. దాంతో.. షాకైపోయిన ఆ ఇంజినీర్ పోలీసులకు చెప్పి… నిఘా పెట్టించి.. ఆ అమ్మాయిని పట్టుకున్నారు. ఆరా తీస్తే.. పోలీసులకు.. మైండ్ బ్లాంకయ్యే నిజాలు బయటకు వచ్చాయి. మొత్తం పద్దెనిమిది ముఠా అని.. వారి ట్రాప్‌లో పడింది ఒక్క జూనియర్ ఇంజినీర్ మాత్రమే కాదు.. పలువురు సీనియర్ అధికారులు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తేలింది.
బ్యూరోక్రాట్స్, ఎంపీలు, ఎమ్మెల్యేల బాగోతాలతో నాలుగు వేల ఫైల్స్..!
పోలీసులు ” క్విడ్ ప్రో కో హనీ ట్రాప్ ” ముఠాను పట్టుకుని… వారి వద్ద సోదాలు చేస్తే… కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాపులు పెన్‌డ్రైవుల్లో… పెద్దల బాగోతమంతా బయట పడింది. కనీసం నాలుగు వేల ఫైల్స్ పోలీసులకు దొరికాయి. అందులో.. ఆ పార్టీ..ఈ పార్టీ అనే తేడా లేకుండా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బ్యూరో క్రాట్లు ఉన్నారు. వీరందర్నీ… బెదిరించి.. అమ్మాయిల ముఠా డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరి వ్యవహారం.. లక్షలు, కోట్లతోనే ఉంటుందని.. అంటున్నారు. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు బ్లాక్మెయిల్ చేయడానికి తగ్గట్లుగా… ఆ వీడియోలు… వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు సిద్ధం చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. అసెంబ్లీలోనూ చర్చకు వచ్చింది. రెండు పార్టీల నేతలూ ఉన్నారు కాబట్టి… పేర్లు బయటకు రాకుండా.. ఇరు పార్టీల నేతలూ.. ఓ ఒప్పందానికి వచ్చేసినట్లుగా ఉన్నారు. పోలీసులు.. ఇంకా విచారణలోనే ఉంది.. కాబట్టి బాధితులు ఎవరెవరో ఇంకా చెప్పేలేమని ప్రకటనలు చేస్తున్నారు.
అసలు తవ్వకాలు పూర్తయితే ఇంకెన్ని బయటకొస్తాయో..?
” క్విడ్ ప్రో కో హనీ ట్రాప్ ” కేవలం డబ్బుల కోసమే జరగలేదనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ కిలేడీల వలలో.. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ కీలక ఉన్నతాధికారి కూడా ఉన్నారు. ఆయన గురించి.. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా కథలు.. కథలుగా ప్రచారం జరుగుతోంది. వీడియో బెదిరింపులకు భయపడి.. ఆ ముఠాకు.. ప్రభుత్వ పరంగా కూడా.. చాలా మేళ్లు చేశారని.. చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు వారి గ్రిప్‌లో ఉండటంతో… ప్రభుత్వ పరంగా.. ఏమైనా అక్రమాలకు ఏమైనా చాన్సిచ్చారా.. సమాచారం ఏమైనా.. ఇచ్చారా.. అన్నదానిపై… పోలీసులు విచారణ జరుపుతున్నారు. అచ్చంగా సినిమాల్లో చేసినట్లుగా… పద్దెనిమిది మంది యువతలు… ముఠాగా ఏర్పడి… పెద్దలను ట్రాప్ చేసి.. బెదిరించి డబ్బులు వసూలు చేయడం.. ఇప్పుడు..దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది.