హైదరాబాద్: పిల్లలపై లైంగిక అత్యాచారాలకు పాల్పడేవారిపై మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఇలాంటి నేరాలకు పాల్పడేవారి పురుషత్వాన్ని తొలగించటం ఒక్కటే ఈ ధోరణిని నివారించటానికి మార్గమని, కేంద్ర ప్రభుత్వం తమ సూచనను పరిశీలించాలని పేర్కొంది. ఈ నేరాలను అరికట్టటానికి సంప్రదాయ చట్టాలు సరిపోవటంలేదని కోర్ట్ అభిప్రాయపడింది. పురుషత్వాన్ని తొలగించటం అనాగరికంగా ఉన్నప్పటికీ, అనాగరిక నేరాలకు తప్పనిసరిగా అనాగరికమైన శిక్షలు విధించాలని పేర్కొంది. చాలామంది దీనిని అంగీకరించకపోవచ్చని, అయితే కఠినమైన వాస్తవాన్ని అందరూ అర్థం చేసుకోక తప్పదని తీర్పు వెలువరించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కిరుబకరన్ అన్నారు. 2011 సంవత్సరంలో తమిళనాడుకు చెందిన ఒక పిల్లవాడిపై లైంగిక అత్యాచారం చేసిన ఓ బ్రిటన్ దేశీయుడి కేసువిషయంలో ఈ తీర్పు వెలువరించింది.