బాలీవుడ్ లో విడుదలై ఘన విజయం అందుకున్న సినిమా `అంధాధూన్`. తెలుగులో `మాస్ట్రో` పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. నితిన్ కథానాయకుడిగా నటించాడు. తమన్నా, నభా నటేషా కీలక పాత్రధారులు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 17న నేరుగా హాట్ స్టార్ లో విడుదల అవుతోంది. ఈలోగా ప్రమోషన్ల జోరు పెంచింది చిత్రబృందం. అందులో భాగంగా ఓ థీమ్ సాంగ్ ని విడుదల చేశారు. ఇది సినిమాలో ఉండదు. కేవలం ప్రచారం కోసం. అయితే అది కాస్త వెరైటీగా డిజైన్ చేశారు. శ్రీమణి ఈ పాట రాస్తే.. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మహతీ విద్యాసాగర్ స్వరకల్పన.
”షురు కరో.. షురు కరో గురూ ఈ స్టోరీ…
నీ కథేమిటో.. బాధేమిటో చెప్పేయ్ ఓసారీ..”
అంటూ మొదలయ్యే పాట ఇది. ఈ పాటలోనే… హీరో పాత్రతోనే ఈ పాటలో సినిమా కథని ప్రేక్షకులకుపరిచయం చేసే ప్రయత్నం చేశారు. మంచి పెప్పీ ట్యూన్ ఇది. పబ్ సెట్లో తెరకెక్కించారు. నితిన్ తో పాటు తమన్నా, నభా నటేషా, నరేష్, శ్రీముఖి, మంగ్లీ, రచ్చ రవి ఈ పాటలో స్టెప్పులు వేశారు.
”గ్లామర్‌నే పోసి చేసిన గ్రనైడే
లేడీలా మారి వస్తోందే నా సైడే” అంటూ తమన్నా క్యారెక్టర్ని వర్ణించారు.
చివర్లో.. ”నెక్టేమిటో రెస్టేమిటో చెప్పేయ్ ఓసారూ.. హై టెన్షనులో పడేసిలా చంపకు మాస్టారూ..” అంటే…
నితిన్..”ప్రొడ్యూసరూ.. డైరెక్టరూ.. ఫోనే చేశారు.. ఆ ట్విస్టేమిటో హాట్ స్టారులో చూసేయ్ మన్నారూ…” అంటూ సరదాగా ముక్తాయించాడు.