సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మహానటి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. సమంత, మోహన్ బాబు, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రధారులు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. నిజానికి మార్చి 28నే ఈ సినిమా రావాల్సింది. 30న రంగస్థలం రావడం, మహానటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో… మే 9కి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఈ నెలాఖరు నుంచి ప్రమోషన్స్ ప్రారంభించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అతి త్వరలో టీజర్ కూడా రాబోతోంది. ఏఎన్నార్ పాత్రలో అక్కినేని నాగచైతన్య కనిపించనున్నాడు. మరి ఎన్టీఆర్ గా ఎవరు కనిపిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.