మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో పంచాయతీ తేలడం లేదు. శివసేనకు చెందిన తాజా మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అసంతృప్తికి గురవుతున్నారు. ఆయనకు ఇంకా గౌరవనీయమైన పొజిషన్ ఖరారు చేయలేదు. ఉపముఖ్యమంత్రిగా చేయడానికి ఆయన నామోషీగా ఫీలవుతున్నారని చెబుతున్నారు. అందుకే ఈ ఫార్ములా ఇంకా ఖరారు కాలేదు.
ముఖ్యమంత్రి ఎవరు.. ఎన్సీపీ, శివసేనలకు ఏ పదవులు ఇస్తారు అన్నదానిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటి వరకు అయితే ఫడ్నవీస్‌కే ముఖ్యమంత్రి పీఠం అని చెబుతున్నారు. కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎవరికీ గ్యారంటీ లేదు. ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాలనుకున్నా ఏక్ నాథ్ షిండే గొంతు ఇన్ ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరడంతో జరగలేదు. ఆయన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ లఅయ్యారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఆలస్యం అయ్యే కొద్దీ ఎన్సీపీ కొత్త కొత్త డిమాండ్లను కూటమి ముందు పెడుతోందన్న ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు పూర్తయిపోయింది. అందుకే షిండే రాజీనామా చేశారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పడుతున్న చిక్కు ముళ్లను మాత్రం బీజేపీ పెద్దలు విప్పలేకపోతున్నారు. కానీ ఐదో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్బాటుకు ముహుర్తం ఖరారు చేశారు.