భరత్ అనే నేను సినిమాలో సరిగ్గా ప్రీ క్లైమక్స్కి ముందు.. ఓ ప్రెస్ మీట్ సీన్ ఉంటుంది. మీడియా మొత్తాన్ని మహేష్ అందులో ఏకిపారేస్తాడు. థియేటర్లో ఆ సన్నివేశానికి క్లాప్స్ పడ్డాయి. క్లైమాక్స్‌కి ఈ సీన్ మంచి ఊపు తెచ్చింది. సరిగ్గా ఇలాంటి సన్నివేశం మహర్షిలో కూడా ఉందట. ప్రీ క్లైమాక్స్‌లోనే ఓ ప్రెస్ మీట్ సీన్‌ని డిజైన్ చేశారు. భరత్ అనే నేనులో మీడియాపై మహేష్ సెటైర్లు వేస్తే.. ఈ సారి అన్ని వర్గాల వారినీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ ప్రెస్ మీట్ లో మహేష్ రైతుల గురించి మాట్లాడతాడని, ఆ స్పీచ్.. ఈ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది. రైతు రైతులానే ఎందుకు ఉండిపోతున్నాడు? అసలు రైతులకున్న సమస్యలేంటి? వాటిని ప్రభుత్వాలు, ప్రజలు ఏ కోణంలో చూడాలి? అనే విషయంపై రుషి ఓ స్పీచ్ ఇస్తాడని, ఈ సినిమా మొత్తానికి అది ప్రాణం లాంటి సన్నివేశమని, ఈ ఒక్క సీన్‌తో ఎమోషన్స్‌ని పీక్స్‌లోకి తీసుకెళ్లబోతున్నాడని సమాచారం. ఇదే మూడ్‌ని క్లైమాక్స్ వరకూ కంటిన్యూ చేయబోతున్నార్ట. అందుకే.. ఈ సినిమా పతాక సన్నివేశాలపై చిత్రబృందం అంత ధీమాగా ఉంది. మనసుల్ని కదిలించే మాటలు, హృదయాల్ని బరువెక్కించే సన్నివేశాలూ చివరి 20 నిమిషాల్లో కనిపించబోతున్నాయని… ఈ సినిమా భవిష్యత్తంతా ఆ సన్నివేశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ సీన్లు ఎలా ఉండాయో చూడాలి.