మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్. నిన్నటికి నిన్న సినిమాలో హీరో హీరోయిన్లు హాగ్ చేసుకుంటున్న స్టిల్ ఇంటర్నెట్లో హల్చల్ చేసింది. మహేష్ అభిమానులు ట్విట్టర్లో ట్వీట్లు, ఫేస్బుక్లో షేర్లు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు, హలోలో పోస్టులు పెట్టారు. ఇప్పటివరకూ మహేష్ – పూజ కాంబినేషన్లో స్టిల్ విడుదల కాకపోవడంతో ఈ స్టిల్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే.. ఈ లీకులపై ‘మహర్షి’ టీమ్ మౌనంగా వుంది. తమకు ఏం సంబంధం లేదన్నట్టు, తమ సినిమా స్టిల్ కాదన్నట్టు వ్యవహరిస్తోంది.
తెలుగు సినిమాలకు లీకుల బెడద కొత్తేమీ కాదు. గతేడాది ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’లో గ్రాఫిక్స్ కోసం పంపిన ఫైట్ సీక్వెన్స్ లీకైంది. వెంటనే అరవింద టీమ్ అప్రమత్తమైంది. దాంతో పోలిస్తే ఇదేమీ పెద్ద లీక్ కాదు. కానీ, ఎటువంటి స్పందన లేకపోవడం ఇండస్ట్రీ వర్గాలకు ఆశ్చర్యంగా వుంది. ‘శైలజారెడ్డి అల్లుడు’లో నాగచైతన్య లుక్ లీకైతే యూనిట్ వెంటనే స్పందించింది. టైటిల్ డిజైన్ లో మార్పులు చేసి, కొత్త స్టిల్ ఫస్ట్ లుక్ గా విడుదల చేసింది. ‘మహర్షి’లో హీరోయిన్ లుక్ బయటకు వస్తే ఎలాంటి స్పందనా లేదు. మహేష్ బాబు సతీమణి నమ్రత పీఆర్ టీమ్ ఈ స్టిల్ లీక్ చేసిందని గుసగుస. ‘మహర్షి’ ముగ్గురు నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి మధ్య సత్సంబంధాలు కొరవడ్డాయని మాటలు వినిపిస్తున్న వేళ ఈ లీకులు కొత్త అనుమానాలకు దారితీసే ప్రమాదం వుంది. వీటిపై సినిమా యూనిట్ జాగ్రత్త పడాలి.