దళిత వర్గాల్లో ధైర్యంగా వాయిస్ వినిపించే నాయకుడిగా పేరు తెచ్చుకున్న మహాసేన రాజేశ్ కు టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో… ఆయనపై వైసీపీ మూకలు భయంకరంగా దాడి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో..బయట ఆయనపై లేని పోని ప్రచారాలు చేస్తున్నాయి. నీలి, కూలి మీడియాలో ఆయనను ఎంతగా టార్గెట్ చేస్తున్నారో అంచనా వేయడం కష్టం. ఆ వేధింపులపై మహాసేన రాజేశ్ స్పందించారు.
” కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను.. జగన్ రెడ్డీ… గుర్తుపెట్టుకుంటాను! .. పోటీ నుండి నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను! నాకోసం నా పార్టీనీ, చంద్రబాబుగారినీ, పవన్ కళ్యాణ్ గారినీ, లోకేష్ గారినీ ఎవ్వరూ తిట్టొద్దు ” అంటూ వీడియో రిలీజ్ చేశారు. తన యూట్యూబ్ చానల్లో పెట్టిన ఈ వీడియోను కూడా.. నీలి, కూలి మీడియాలు తప్పుడుగా ప్రచారం చేస్తున్నాయి. ఆయన పోటీ నుంచి వైదొలిగారని అంటున్నారు కానీ ఆ వీడియోలో కావాలంటే వైదొలుగుతాను అన్నారు కానీ వైదొలిగాను అని చెప్పలేదు.
సరిపెల్ల రాజేష్ మహాసేన పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కులానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. మొదట్లో ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆ తర్వాత 2014లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అంతకు ముందే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలను ఎవరూ ప్రశ్నించలేదు. కానీ టీడీపీలో చేరిన తర్వాత మాత్రం ఆయనను తప్పు పడుతున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న దళిత నాయకుడు అయిన మహాసేన రాజేష్ లాంటి వాళ్లను చంద్రబాబు ప్రోత్సహిస్తారు కానీ.. వెనక్కి తగ్గరని అంటున్నారు.
మహాసేన రాజేష్ ఇప్పటికే పి.గన్నవరంలో ప్రచారం కూడా ప్రారంభించారు.