నీరు పల్లమెరుగు అన్నట్లు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నేతలు సహజంగానే అధికార పార్టీ వైపు పయనిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఇదే సూత్రం చాలా చక్కగా అమలవుతోంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నుండి అధికార తెదేపాలోకి వలసలు కొనసాగుతుంటే, తెలంగాణాలో తెదేపా నుండి అధికార తెరాసలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి మహీధర్ రెడ్డి తెదేపాలో చేరేందుకు రంగం సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. సంక్రాంతి పండుగ తరువాత అయన తెదేపాలో చేరవచ్చని సమాచారం. వైకాపా నేతలు కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీ కూడా అదే సమయంలో తెదేపాలో చేరవచ్చని సమాచారం.