యాత్ర2 సినిమా తీసి జగన్ రెడ్డికి లేనిపోని ఆమాయకత్వాన్ని అంటగట్టి .. ఎలివేషన్లు ఇచ్చి హార్సిలీ హిల్స్ లో పదెకరాలు కొట్టేసే క్రమంలో మొదటగా రెండు ఎకరాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైన మహి వి రాఘవ చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అసలు పేరు మహి వి రాఘవ కాదు. వారణాసి మహేందర్ రెడ్డి. తమ పేరును మహి వి రాఘవ అని పెట్టుకుని ఇండస్ట్రీలో చెలామణి అవుతున్నారు. ఆయన తల్లి పులివెందుల, తండ్రి పుంగనూరుకు చెందిన వారు.
కృష్ణుడుతో సినిమాలు తీసుకునే రేంజ్ నుంచి ఒక్క సారిగా పొలిటికల్ సినిమాలు ఎలా తీశారా అని అప్పట్లో చాలా మంది అనుకున్నారు కానీ.. ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన క్విడ్ ప్రో కో వ్యవహారం వెలుగులోకి రావడంతో మనోడి చరిత్ర ఏమిటని ఆసక్తిగా చూడటం ప్రారంభిచారు. ఇప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అన్నను పొగిడితే చాలు దోచి పెట్టేస్తాడని ఇట్టే కనిపెట్టి… యాత్ర 2 సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాకపోయినా తానే ఖర్చు పెట్టుకుని సినిమా తీశారు. బాక్సాఫీస్ నుంచి కానీ… నాన్ థియేటరికల్ రెవిన్యూ కానీ ఒక్క రూపాయి రాదని తెలిసి కూడ భారీగా ఖర్చు పెట్టారు. ఎందుకు అంటే.. గూడు పుఠాణి వెలుగులోకి వచ్చిన తర్వాత బయట పడుతోంది.
వారణాసి మరేందర్ రెడ్డి అలియాస్ మహి వి రాఘవ … క్విడ్ ప్రో కో గురించి బయటకు వచ్చిన తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్లో స్పందించారు. మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నట్లుగా… వైసీపీ మార్క్ కౌంటర్ ఇచ్చారు. మరి నిజం ఏమిటో చెప్పొచ్చుగా..? . భూమి కావాలని దరఖాస్తు పెట్టారా లేదా ?. అది యాత్ర సినిమాతో లింక్ అయి ఉందా లేదా ?. వైసీపీ కోసం ఎన్నికల్లో పని చేస్తున్నారా లేదా ?.. వీటి గురించి సమాధానం చెప్పకుండా.. .. మీడియానే ఏదో తప్పు రాస్తోందని నంగి నంగిగా ట్వీట్ చేయడం చేయడం ఎందుకు ?
జగన్ రెడ్డికి ఎంతైనా బాకా ఊదుకోవచ్చు… కానీ అందుకు ప్రజా ఆస్తుల్ని కొట్టేయాలనుకోవడమే నేరం. సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకుంటే అది ప్రజల తప్పు కాదు. సైతాన్ లాంటి వెబ్ సిరీస్లను వైసీపీ నేతల భాషలో తీసి.. అయినా డబ్బు సంపాదించుకోవచ్చు కానీ.. క్విడ్ ప్రో కోకు పాల్పడితే.. శంకరగిరి మాన్యాలే. జగన్ రెడ్డితో ప్యాచప్ అయిన అనేక మంది పరిస్థితి లేదు.. మహి వి రాఘవ తనకు కూడా అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి.