టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్టయ్యింది. మహేష్ – త్రివిక్రమ్ ఈ సారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. అతడు, ఖలేజా తరవాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ఈనెల 31 న లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సినిమాకి సంబంధించిన ఇంకొన్ని అప్ డేట్స్ త్వరలో రాబోతున్నాయి.
ఈ చిత్రానికి `పార్థూ` అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు టాక్. `అతడు`లో మహేష్ పేరు పార్థూ. ఈ సినిమాలోనూ హీరోకి అదే పేరు పెట్టి `అతడు`లో మహేష్ ని గుర్తు చేయబోతున్నాడట త్రివిక్రమ్. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ అదే. ఈమధ్య… త్రివిక్రమ్ పొయెటిక్ టైటిల్స్ పెడుతున్నాడు. అలాంటి టైటిల్ ఏదైనా తగిలితే… తప్ప `పార్థూ`నే ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. కథానాయికగా దిశాపటానీని ఎంచుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో ఉన్నార్ట. మరో ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు ప్రకటిస్తారు.