కీర్తి సురేష్ కి సర్కారు పాట నుంచి పెద్ద గిఫ్ట్ లభించింది. సినిమాలో ఆమె పాత్ర పేరుతో కళావతి పాట చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. ట్రైలర్ లై కూడా ఆమె పాత్ర మెరుపులా మెరిసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ మాటలు ఆమె పాత్ర పై ఇంకా అంచానాలు పెంచాయి. హీరో హీరోయిన్ ట్రాక్ కోసం రీపిట్ ఆడియన్స్ వస్తారని స్వయంగా మహేష్ చెప్పడం ఆసక్తిని పెంచింది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కీర్తి సురేష్ స్పీచ్ మహేష్ బాబు అభిమానులని ఆకట్టుకుంది. చాలా స్వీట్ అండ్ క్యుట్ గా మాట్లాడింది. నేను విన్నాను నేను వున్నాను డైలాగ్ ని మహేష్ పేరుతో లింక్ చేసింది.
”మహేష్ గారితో వర్క్ చేసినప్పుడు ఆయన ఎనర్జీ టైమింగ్ మ్యాచ్ చేయడానికి టెన్సన్ పడ్డా. మహేష్ గారితో పని చేయడం ఒక గౌరవం. ”మహేష్ గారు వున్నారు .. ఆయన విన్నారు.. అందరూ మే 12న థియేటర్ లో సర్కారు వారి పాట చూడండి” అని చెప్పుకొచ్చింది, కీర్తి ఈ డైలాగ్ చెప్పినప్పుడు మహేష్ ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.