కొరటాల శివ సినిమాల్లో.. సందేశం, కమర్షియల్ అంశాలు భలే మిక్సయిపోతాయి. అయితే… అందరూ పెద్దగా గుర్తించని విషయం.. కొరటాల శివ సినిమాల్లో లవ్ స్టోరీలు కూడా భలే బాగుంటాయి. కమర్షియల్ , మెసేజ్ మధ్యలో అతని లవ్ స్టోరీల్ని పెద్దగా పట్టించుకోలేదంతే. మిర్చిలో ప్రభాస్ – అనుష్కల మధ్య లవ్ ట్రాక్ రొమాంటిక్‌గా ఉంటుంది. ప్రభాస్‌ని పడేయడానికి అనుష్క రకరకాలుగా ప్రయత్నిస్తుంటుంది. మధ్యలో సత్యం రాజేష్‌ని కూడా వాడుకుంటుంటుంది. శ్రీమంతుడులో మహేష్ – శ్రుతి లవ్ ట్రాక్ కూడా చెప్పుకోదగినదే. హీరోయిన్ వల్లే మహేష్‌లోనూ మార్పు వస్తుంది. ఫస్టాఫ్‌లో కాలేజీ సీన్లు, లవ్ ట్రాక్ సినిమాని నడిపించాయి. సరిగ్గా అదే మ్యాజిక్ ఇప్పుడు `భరత్ అనే నేను`లోనూ వర్కవుట్ అయ్యాయట. ఓ ముఖ్యమంత్రి ప్రేమలో పడితే.. ఎలా ఉంటుందో.. ఇందులో చూపించే అవకాశం వచ్చింది కొరటాలకు. సీఎం రొమాన్స్ హద్దు దాటకూడదు. అదే సమయంలో లవ్ ఫీల్ మిస్సవ్వకూడదు. అందుకే… హీరోయిన్ వైపు నుంచి నరుక్కొచ్చాడట. లవ్ ట్రాక్‌లో హీరోయిన్ పాత్రే కీలకమని, కైరా ఆద్వానీ క్యారెక్టరైజేషన్‌ని కొరటాల బాగా మలిచాడని తెలుస్తోంది. సీఎంగా మహేష్ గద్దె దిగడానికి కూడా….కైరా పాత్రే కీలకం అవుతుందని టాక్ వినిపిస్తోంది. అలా.. హీరోయిన్ పాత్రని కథలో బాగా వాడుకున్నాడట కొరటాల. ఆ పాత్రలో కైరా కూడా చాలా బాగా నటించిందని, మహేష్ గ్లామర్‌కి సరితూగేలా కనిపించిందని, ఈ సినిమాతో కైరాకి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు, సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.