మహేష్ బాబు- మురగదాస్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా ఇది. మురగదాస్ తో మహేష్ చేస్తున్న మొదటి సినిమా. అలాగే మహేష్ కెరీర్ లో మొదటి బైలింగ్వల్ మూవీ… ఇలా బోలెడు ప్రత్యేకతలు వున్న ఈ సినిమా ప్రస్తుతం ఎనబై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటికి వరకూ ఈ సినిమాకి సంబధించి ఎలాంటి మెటిరియల్ ని బయటపెట్టలేదు. దీనికి కారణం కూడా వుంది. తన సినిమా ఫస్ట్ లుక్, టీజర్లపై చాలా సెలక్టివ్ గా వుంటారు మురగదాస్. దీనికోసం ఒక కాన్సెప్ట్ అనుకోని స్పెషల్ కేర్ తో టీజర్ ను కట్ చేస్తుంటారు. ఇప్పుడు మహేష్ సినిమా కోసం అదే పనిలో వున్నారు. ఇప్పటికే కాన్సెప్ట్ రెడీ అయ్యిందట. టీజర్ మెటిరియల్ కూడా కట్ చేశారు. ఇప్పుడీ టీజర్ లండన్ వెళ్ళింది. అక్కడ వీఎఫ్ఎక్స్ నిపుణల సమక్షంలో ఈ టీజర్ తుదిమెరుగులు దిద్దుకుంటుదని టాక్.
ఈ రోజుల్లో సినిమా పై హైప్ క్రియేట్ కావడానికి టీజర్ కీలక పాత్ర పోషితున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు ఫస్ట్ టీజర్ తోనే సినిమాపై అంచనాలను పెరుగుతున్నాయి. ఇప్పుడు మహేష్- మురగదాస్ సినిమా పై కూడా భారీ అంచనాలు వున్నాయి. ఈ అంచనాలు తగ్గట్టు టీజర్ పై స్పెషల్ కేర్ తీసుకుంటుంది చిత్ర యూనిట్. తెలుగు, తమిళ భాషల్లో రుపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సంతోష్ శివన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నాడు. హ్యారీష్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖారారు చేయలేదు. టైటిల్, టీజర్ ఒకేసారి రివిల్ చేస్తారని తెలుస్తోంది.