టాలీవుడ్లో నెంబర్ వన్ ఎవరంటే టక్కున చెప్పేయలేం. మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్ ఈ స్థానానికి గట్టి పోటీదారులు. ఎవరికి వాళ్లే. ఒకరి రికార్డుల్ని మరొకరు బద్దలు కొట్టేస్తుంటారు. హిట్ పడితే చాలు.. వాళ్ల సినిమా వసూళ్లు ఓ రేంజులో ఉంటాయి. టాలీవుడ్ తల రాతని మార్చే దమ్ము వీళ్లకే ఉంది. వాళ్లు స్వతహాగా `పోటీ` గురించి ఎప్పుడూ బయటపడకపోయినా…. అంకెలు, బాక్సాఫీసు లెక్కలు మాత్రం పోటీ ఎంత రసవత్తరంగా సాగుతోందో లెక్క గడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఓ విషయంలో మహేష్.. పవన్ సినిమాని బీట్ చేయలేకపోయాడు. అదేంటంటే…
బ్రహ్మోత్సవం సినిమాని జీ తెలుగు రూ11.20 కోట్లకు కొనుగోలు చేసింది. మహేష్ సినిమాల్లో ఇదే రికార్డ్. అయితే.. ఈసారి మహేష్, పవన్ సినిమాని దాటలేకపోయాడు. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా మా టీవీ రూ.12 కోట్లకు కొనుకోలు చేసింది. అంటే పవన్ కంటే 80 లక్షలు తక్కువ వసూలు చేసిందన్నమాట.దానికీ కారణం ఉంది. ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమాకి ఎంత హైప్ ఉందో, అంతకు రెట్టింపు క్రేజ్ సర్దార్ సినిమాకొచ్చింది. అందుకే శాటిలైట్ అంత రేటు పలికింది. బాహుబలి తరవాత.. అత్యధిక ధరకి అమ్ముడుపోయిన సినిమా సర్దారే. ఆ తరవాత బ్రహ్మోత్సవం ఉంది.