సర్కారు వారి పాట తరవాత.. మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలి. ఈ సినిమా ఈ రోజు.. రేపు.. అంటూ వాయిదా పడుతోంది. జనవరిలో ఈ సినిమాని పట్టాలెక్కించాలని అనుకున్నారు. కానీ… ఈ సినిమా ఇప్పట్లో లేనట్టే. ఎందుకంటే.. మహేష్ కి ఓ ప్రధానమైన శస్త్ర చికిత్స జరగబోతోంది. మోకాలి ఆపరేషన్ కోసం మహేష్ విదేశాలకు వెళ్లబోతున్నారు. ఆ ఆపరేషన్ తరవాత మహేష్ కనీసం మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని తెలుస్తోంది. `సర్కారు వారి పాట`లో తన పార్ట్ షూటింగ్ వీలైనంత త్వరగా ముగించాలన్నది మహేష్ ఆలోచన. ఆ తరవాత… ఆయన విశ్రాంతి మోడ్‌లోకి వెళ్లిపోతారు. సర్జరీ అయ్యాక… మహేష్ – రాజమౌళి సినిమాపై ఫోకస్ చేసే అవకాశం ఉందని, త్రివిక్రమ్ సినిమా దాదాపుగా లేనట్టే అని టాక్. అయితే త్రివిక్రమ్ కి కూడా ఆప్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి. పవన్, అల్లు అర్జున్, ఎన్టీఆర్… వీళ్లంతా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉన్నారు. స్టార్ హీరో దొరకాలంటే త్రివిక్రమ్ కూడా కొంత కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి. లేదంటే `అ.ఆ`లా ఓ మీడియం రేంజు సినిమా తీసుకోవాలి.