ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలివుడ్ నటుడు అజరు దేవగన్‌ను నియమించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ప్రతిపాదన వచ్చింది.అయితే సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాత్రం అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రత్యక్షమవడంతో ప్రజలు ఆశ్చర్యానందాల్లో మునిగిపోయారు. నాగార్జున యూనివర్సిటీ వెనకభాగంలో కాజగ్రామంలో రామకృష్ణ రియల్‌ఎస్టేట్స్ వారు వెనిజీయా పేరుతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తున్నారు. 32 అంతస్తుల ఈ నిర్మాణాలకు గతంలో అనుమతి రాలేదన్నారు గాని ఇప్పుడు వచ్చిందేమో తెలియదు. ఈ వెంచర్‌కు ప్రిన్స్ మహేష్‌బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వుంటారని అనిల్ సుంకర ఒకటికి రెండుసార్లు ప్రకటించారు. మహేష్ యథావిధిగా శుభాకాంక్షలు చెప్పి ముగించారు. ఆయన బావ ఎంపి గల్లాజయదేవ్, ఎంఎల్ఎ ముళ్లపూడి నరేంద్ర కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రజలు కేరింతలు కొట్టారు. తన హృదయంలో విజయవాడకు ప్రత్యేక స్థానం వుందని ఒక్కడు దూకుడు విజయోత్సవాలు ఇక్కడే జరిగాయని మహేష్ సభలోనూ మీడియా గోష్టిలోనూ చెప్పారు. ఇంతటి సూపర్‌స్టార్ అంబాసిడర్‌గా వచ్చారంటే అమరావతిలో రియల్ వ్యాపారం ఏ స్థాయిలో వుందో తెలియడం లేదూ? దానికి ముందు తను దత్తత తీసుకున్న స్వగ్రామం బుర్రిపాలెంలో కూడా శ్రీమంతుడు తరహాలో పర్యటించారు మహేష్‌బాబు. అక్కడ సభలో వైద్య శిబిరం నిర్వహణ, అభివృద్ధి ప్రణాళికల గురించి ప్రస్తావించారు. అయితే ఉపాధికి సంబంధించి యువత ప్రశ్నలు వేసి సరైన జవాబులు రాక నిరుత్సాహ పడినట్టు సమాచారం.