మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్.. బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు తుది మెరుగుల్లో ఉంది. ఈనెల 20న బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ ఫిక్సవ్వడంతో, చిత్రబృందం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పుడు.. సెన్సార్ డేట్, టైమ్ కూడా ఫిక్సయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవం సినిమా సెన్సార్‌కు స్లాట్ దొరికింది. మూడు గంటల కల్లా సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చేస్తోంది. శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటేనే క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం ఖాయం. బ్రహ్మోత్సవానికి ఆ సర్టిఫికెటే రాబోతోంది.
మరోవైపు బ్రహ్మోత్సవం టీమ్ పబ్లిసిటీని బాగా పెంచేసింది. నమ్రత పబ్లిసిటీ బాధ్యతల్ని తీసుకొని.. దగ్గరుండి మరీ వ్యవహారాలు చక్కబెడుతోందని టాక్. ఇప్పటికే ఇంటర్వ్యూల ప్రహసనం మొదలైంది. ఒకట్రెండు రోజుల్లో మహేష్‌బాబు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని టాక్. సొంత సినిమా కదా, ఆ మాత్రం కేర్ తీసుకోక తప్పదు మరి.