భారీ అంచనాల మధ్య శుక్రవారం బ్రహ్మోత్సవం విడుదలైంది. ప్రీమియర్ షోల నుంచే నెగిటీవ్ టాక్ని ఎదుర్కోవాల్సివచ్చింది. సినిమా బోరింగ్‌గా ఉందని, ల్యాగ్ ఎక్కువైందని, పాటలు అడ్డొచ్చాయని కామెంట్లు వినిపించాయి. దాంతో చిత్రబృందం దిద్దుబాటు చర్యలకు దిగిపోయింది. ఫస్ట్ షో అయిన వెంటనే.. ఈ సినిమాలోని 12 నిమిషాల సన్నివేశాల్ని తొలగించింది. సినిమా నిడివి 2గంటల 33 నిమిషాలు. ఇప్పుడు 2 గంటల 21 నిమిషాలకు కుదించారు. మరి ఏయే సన్నివేశాల్ని ట్రిమ్ చేశారో.. తెలియాల్సివుంది. ట్రిమ్ చేసిన సినిమాని ఈరోజు నుంచి థియేటర్లలో చూడొచ్చు.
మొత్తంగా శ్రీకాంత్ అడ్డాల 2 గంటల 45 నిమిషాల సినిమాని పీవీపీ చేతిలో పెట్టాడట. మరి అంత లెంగ్తీ సినిమా చూడ్డం కష్టమని 13 నిమిషాల సీన్లు తీసేశారు. అందుకే అక్కడక్కడ జంపింగ్‌లు వస్తాయి. సీన్ సడన్‌గా పూర్తయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్లీ కటింగులు చేశారు. ఇంకెన్ని జంపింగ్‌లు చూడాల్సివస్తుందో?? ఇప్పటికే బ్రహ్మోత్సవం అతుకుల బొంతలా తయారైంది. ఈ కటింగుల తరవాత బ్రహ్మోత్సవం ఏమైపోతుందో?