పరాయి భాషలోని ట్యూన్స్ ఎత్తేసి, తెలుగు పాటలా మార్చేయడం మన సంగీత దర్శకులకు అలవాటే! తమన్ ఈ విషయంలో సిద్దహస్తుడు. తానే చాలాసార్లు ”అవును ఆ పాటని స్ఫూర్తిగా తీసుకొన్నా” అని పరోక్షంగా ఒప్పుకొన్నాడు. ఇప్పుడు మిక్కీ జె.మేయర్ కూడా అదే బాట పట్టాడు. మిక్కీ సంగీతం అందించిన చిత్రం బ్రహ్మోత్సవం. అందులో తొలిపాట వచ్చింది కదా, అవకాశం విడుదల చేసినప్పుడే.. దానిపై కాపీ ట్యూన్ అనే ముద్ర పడిపోయింది. ఆడియో రిలీజ్ అయ్యాక మరో కాపీ పాట బయటపడింది. ఇందులో బాలా త్రిపుర మణి పాట ట్యూన్ హాలీవుడ్ గీతం… వన్‌లైఫ్ అనే పాటకు అతి దగ్గరగా ఉంటుంది. టేక్ ఆఫ్‌లో వచ్చే మ్యూజిక్ బిట్ అయితే.. సేమ్ టూ సేమ్ దించేశాడు.
ఓ వైపు శ్రీకాంత్ అడ్డాల మనదైన కథ, మనదైన బంధాలూ అంటూ అందంగా ఓ కథ చెబుతుంటే.. అందులో ఈ కాపీ ట్యూన్ల గోలేంటో అర్థం కావడం లేదు. మిక్కీ ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెబుతాడో చూడాలి. సినిమా పాటలు స్లోగా ఉన్నాయని మహేష్ అభిమానులే కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో కాపీ ట్యూన్లు అని తేలడం వాళ్లని మరింత నిరుత్సాహానికి గురిచేసే విషయం. వీటిపై మిక్కీ ఎలా స్పందిస్తాడో చూడాలి.