సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న బ్రహ్మోత్సవం సినిమా తర్వాత మురుగదాస్ సినిమా చేస్తాడని తెలిసిందే. అయితే భారీ అంచనాలతో స్టార్ట్ అవ్వబోతున్న ఈ సినిమాకు మహేష్ బాబు తీసుకునే రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉందట. సాధారణంగా సినిమాకు 18 కోట్ల దాకా తీసుకునే మహేష్ మురుగదాస్ తో చేస్తున్న సినిమాకు గాను 25 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అయితే మహేష్ డిమాండ్ చేసినంత ఇవ్వడానికి రెడీ అయ్యారు నిర్మాతలు.
ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్లకు పైగా ఉంటుదని అంటున్నారు. తన సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే మురుగదాస్ ఈ సినిమాలో న్యాయవ్యవస్థకు సంబంధించిన సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఉన్న మురుగదాస్ ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ చేస్తున్న బ్రహ్మోత్సవం షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమా పట్టలెక్కుతుందట. మహేష్, మురుగదాస్‌ల మూవీ ఏప్రిల్ 8న స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలన రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.