ఆల్రెడీ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి దూరం అవుతున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు.. మహేష్ బాబు ఫ్యాన్స్ తోనూ పెట్టుకొన్నాడు. `బన్నీ కేవలం రికార్డుల గురించి ఆలోచించే హీరో` అంటూ సోషల్ మీడియాలో బన్నీపై విరుచుకుపడుతున్నారు మహేష్ ఫ్యాన్స్. అసలు మహేష్ ఫ్యాన్స్‌కీ, బన్నీకీ గొడవ ఎక్కడ మొదలైందంటారా? అక్కడికే వస్తున్నాం. బ్రహ్మోత్సవం సినిమా ఈనెల 20న విడుదల కాబోతోంది. ఈ సినిమాని వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలన్నది నిర్మాత వ్యూహం. అయితే చాలా చోట్ల బ్రహ్మోత్సవం సినిమాకి టికెట్లు దొరడకం లేదు. దానికి కారణం.. సరైనోడు సినిమానే.
సరైనోడు గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమా. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఆడుతోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎక్కువ థియేటర్లలో సరైనోడు రన్ అవుతుంది. ఆ థియేటర్లన్నీ అల్లు అరవింద్ చేతుల్లో ఉన్నాయి. ఆయన పర్మిషన్ వస్తే గానీ… బ్రహ్మోత్సవంకి థియేటర్లు దొరకవు. కానీ ఇప్పుడు అల్లు అరవింద్ థియేటర్లు వదలడం లేదు. సరైనోడునే ఆడించాలని చూస్తున్నారు. థియేటర్లలో జనం లేకపోయినా సరైనోడునే ఆడించడానికి కారణం.. ఈ సినిమాని ఉత్తరాంధ్రలో వీలైనన్ని చోట్ల 50 రోజులు ఆడించాలన్నది బన్నీ ఉద్దేశమట. అందుకే బ్రహ్మోత్సవంకి థియేటర్లు దొరడకం లేదు. బయ్యర్లు కూడా బ్రహ్మోత్సవం ఆడించాల్సిందే అని పట్టుబడుతున్నా అరవింద్ మాట వినడం లేదని టాక్. కొడుకు సినిమాపై ఏ తండ్రికైనా ప్రేమ ఉంటుంది. కానీ సినిమా ఆడకపోయినా కేవలం రికార్డుల కోసం మరో సినిమాని అడ్డుకోవడం మాత్రం సరికాదు అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.