రాజమౌళి సినిమా అంటే ఆషామాషీగా ఉండదు. ఇది వరకు తెలుగు తెర చూడని అద్భుతాల్ని ఆవిష్కరిస్తారాయన. మామూలు కథని సైతం విజువల్ ఫీస్ట్ గా చూపించడంలో ఆయన దిట్ట. మహేష్ బాబుతో రాజమౌళి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదో అడ్వైంచరస్ థ్రిల్లర్. దానికి తగినట్టుగానే ప్రేక్షకులకు కావల్సినంత థ్రిల్ ఇవ్వడానికి భారీగా కసరత్తులు చేస్తున్నారు. అటవీ నేపథ్యంలో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ తెరకెక్కించనున్నారు. అడవి అనగానే థ్రిల్ కి కావాల్సినంత స్పేస్ ఉంటుంది. దాన్ని రాజమౌళి కూడా తనదైన స్టైల్ లో వాడుకోబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఓ ఎపిసోడ్ డైనోసర్స్ చుట్టూ సాగుతుందట. హీరో వెంట డైనోసార్స్ పడడం, హీరోని ఛేజ్ చేయడం, వాటి నుంచి హీరో తనని తాను కాపాడుకోవడం.. ఈ ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్ లో పిక్చరైజ్ చేయబోతున్నార్ట. భారతీయ తెరపైనే ఇలాంటి ఎపిసోడ్ ఇప్పటి వరకూ ఎవ్వరూ చిత్రీకరించలేదని, అది ఎస్.ఎస్.రాజమౌళి సినిమాతోనే సాధ్యమవ్వబోతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమా కోసం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా గట్టిగా చేశారు. ముందుగానే విజువలైజేషన్ చేయడం వల్ల సీన్స్ చాలా త్వరగా షూట్ చేయగలుగుతున్నార్ట. వీఎఫ్ఎక్స్కి కూడా ఎక్కువ సమయం పట్టదని తెలుస్తోంది. ఇలాంటి డైనోసర్ ఎపిసోడ్లు ఈ సినిమాలో కనీసం 4-5 ఉన్నాయని, వాటి కోసమే సగం బడ్జెట్ కేటాయించారని, ప్రతీ యాక్షన్ ఎపిసోడ్ కొత్త స్టైల్ లో డిజైన్ చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రియాంకా చోప్రా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఫృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటించనున్నాడు. తండ్రీ – కొడుకుల ఎమోషన్‌కి పెద్ద పీట వేశారు. తండ్రి పాత్రలో ఓ ప్రముఖ నటుడు కనిపించనున్నారు. ఆయనెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.