సంగీత దర్శకుడు నుండి హీరోగా మారిన జివి ప్రకాశ్ వరుసెంట క్రేజీ సినిమాలు తీస్తున్నాడు.. తమిళ ప్రేక్షకులను హీరోగా కూడా అలరిస్తున్న జివి తెలుగులో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే జివి ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు ఓ సంగీత దర్శకుడిగా పరిచయమే.. డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట సినిమాలతో తన సంగీతంతో అలరించాడు జివి.
ప్రస్తుతం హీరోగా చేస్తునే మ్యూజిక్ డైరక్టర్ గా కొనసాగిస్తున్నాడు.. తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తున్న ప్రకాష్ వాటిని తెలుగులో కూడా రిలీజ్ చేసేలా రంగం సిద్ధం చేసుకున్నాడు. గురుడు కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ మార్కెట్ మీద కూడా కన్నేశాడన్నమాట ఇప్పటికే ఈ యువ హీరో నటించిన త్రిష లేదా నయనతార తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు అదే తీరున ‘పెన్సిల్’ సినిమాతో రాబోతున్నాడు జివి ప్రకాష్. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల్లో డైరెక్ట్ గా తీసుకెళ్లేలా సూపర్ స్టార్ మహేష్ చేతుల మీద ఆడియో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు పెన్సిల్ దర్శక నిర్మాతలు. ఈ మధ్య మహేష్ బాగా పబ్లిక్ ఫంక్షన్స్ కు అటెండ్ అవుతున్న విషయం తెలిసిందే.. తనకు తోచినంత సపోర్ట్ సినిమాకు ఇవ్వడానికి మహేష్ ఈ మధ్య బాగా ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలోనే జివి ప్రకాష్ పెన్సిల్ ఆడియోకి మహేష్ రావడం ఖాయం అంటున్నారు.
మణి నాగరాజ్ డైరెక్ట్ చేసిన పెన్సిల్ సినిమా తమిళంలో ఆల్రెడీ రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. మరి జివి ప్రకాష్ తెలుగులో ఏమాత్రం సక్సెస్ అవుతాడో చూడాలి. శ్రీదివ్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎస్.పి.రాఘవెన్ నిర్మించడం జరిగింది.