‘మహర్షి’ సినిమా చూశాక అభిమానులంతా కాలర్లు ఎగరేస్తారని… ఈ సినిమా విడుదలకు ముందే మహేష్ జోస్యం చెప్పాడు. మహర్షి విజయంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. ప్రస్తుతం బాక్సాఫీసు రికార్డుల్ని చూసి మహేష్ ఫ్యాన్స్ కాలర్లు ఎగరేస్తున్నారు. మహేష్ కూడా మొన్నటి సక్సెస్ మీట్లో కాలర్ ఎగరేశాడు. ఇప్పుడు మరోసారి అభిమానుల ముందు కాలర్ ఎగరేసి – హంగామా చేశాడు.
మహర్షి విజయోత్సవంతో భాగంగా ఈ రోజు మహేష్ సుదర్శన్ థియేటర్‌కి తన టీమ్ తో సహా వెళ్లాడు. అక్కడున్న అభిమానుల్ని ఉత్సాహపరచడానికి మరోసారి కాలర్ ఎగరేశాడు. ఇదే థియేటర్లో తను మురారి సినిమా చూశానని గుర్తు చేసుకున్నాడు. “మురారి ఇదే థియేటర్లో చూశా. ఆ రోజు సినిమా చూశాక నాన్నగారు నా భుజం మీద సంతోషంగా చేయి వేశారు. అప్పటి నుంచీ ఈ థియేటర్ నాకెంతో ప్రత్యేకంగా మారింది. ఈమధ్య నేను ఎంబీ అనే మల్టీప్లెక్స్‌లో భాగం పొందాను. అయినప్పటికీ సుదర్శన్ నా సొంత థియేటర్లా భావిస్తాను” అని చెప్పుకొచ్చాడు మహేష్.