ఒక తెలివితక్కువ వాడు తెలివైనవాన్ని తెలివితక్కువ ప్రశ్న అడిగితే.. ఆ తెలివైన వాడు తెలివితక్కువ వానికి తెలివైన సమాధానం చెబితే.. ఎలా ఉంటుంది తెలివి ఉన్నా లేకుండా తెలివి తక్కువ వానికి అదేం అర్ధం కాదు. ఇంతకీ ఏంటి తెలివి తక్కువ తిక్కరాయుళ్ల గోల అంటే.. నిన్న జరిగిన నాని కృష్ణగాడి వీర ప్రేమగాథ ఆడియోలో సుమ, సుకుమార్ ల పరిస్థితి చూస్తే పైన చెప్పిన విషయమే అర్ధమవుతుంది. ఇంతకీ సుకుమార్ ని సుమ ఏమడిగింది అంత తెలివైన సమాధానం సుకుమార్ ఏం చెప్పాడు అంటే… ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అందరికన్నా ఎక్కువ మాట్లాడేది ఆ యాంకరమ్మే అనుకుంట.
అయితే ఈ మధ్య నాన్నకు ప్రేమతోతో ప్రేక్షకుల తెలివితేటలకు పనిచెప్పిన సుక్కు ఆ ఆడియో వేడుకకు వచ్చాడు. అయితే సుకుమార్ స్టేజ్ మీదకు రాగానే సుమ తాను తెలివైందో.. తెలివి తక్కువైందో.. అతి తెలివైందో.. తెలుసుకోవాలనుకుంది. కాని సుమ పప్పులేం ఉడకలేదు. సుక్కు మొదటి క్రష్ ఎవరు అని అడిగిన సుమకు సుక్కు ఆన్సర్ తనకు తానే తెలివైందా కాదా అని తెలుసుకునేలా చేసింది. ఇంతకీ సుకుమార్ ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే.. మహేష్ అని.
తన మొదటి ప్రేమ పులకరింత చెప్పమంటే సింపుల్ గా మహేష్ అని చెప్పి మరోసారి తన తెలివితేటలను ప్రదర్శించాడు సుకుమార్. తను తీసిన సినిమాల్లో పాత్రల ప్రభావం తన నుండే వచ్చింది అన్నది తెలియచెప్పేలా తన బయట క్యారక్టర్ కూడా ఉంటుంది. అయితే సుకుమార్ ఇచ్చిన ఆన్సర్ కు అతిథిగా అసీనుడైన సూపర్ స్టార్ మహేష్ కూడా చిరునవ్వులు చిందించేలా చేసింది.