ఈ సమ్మర్ కు హాట్ కేక్ అనుకుంటున్న మహర్షి సినిమా మార్కెటింగ్ పూర్తయిపోయింది. నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తన రెగ్యులర్ బయ్యర్లకే సినిమాను ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు, భరత్ అనే నేను సినిమా మార్కెట్ చేసిన రేట్లకే దాదాపుగా మహర్షి సినిమాను కూడా ఇచ్చేసినట్లు తెలిసింది.
ఆంధ్రను 38 కోట్ల రేషియోలో, సీడెడ్ 12 కోట్లకు ఇచ్చేసారని తెలుస్తోంది. ఆంధ్రను డిఫరెంట్ బయ్యర్లకు, సీడెడ్ ను ఫైనాన్సిషయర్ శోభన్ కు ఇచ్చారు. నైజాం, అలాగే ఆంధ్రలోని వైజాగ్ ఏరియాలకు రేట్లు కట్టి నిర్మాత దిల్ రాజు వుంచుకున్నారు. నైజాంకు ఎంత రేటు కడుతున్నారన్నది ఇంకా బయటకు రాలేదు.
భరత్ అనే నేను నైజాం ఏరియా 22 కోట్లకు ఇస్తే, 19 కోట్లకు లోపే కలెక్షన్లు ఆగిపోయాయి. అందువల్ల ఇప్పుడు మహర్షిని బహుశా ఆ ఫిగర్ కు కాస్త అటు ఇటుగా ఫిక్స్ చేసారని తెలుస్తోంది. 17 లేదా 18 రేంజ్ లో ఫిక్స్ చేసే అవకాశం వుందని బోగట్టా.
ఓవర్ సీస్ మాత్రం ఇంకా రకరకాల ఆపర్లను పరిశీలిస్తున్నారు. నిర్మాత అశ్వనీదత్ ఒకరిని రికమెండ్ చేస్తే, దిల్ రాజు మరొకరి పేరు చెబుతున్నట్లు తెలుస్తోంది.