సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలసి ప్రస్తుతం అమెరికా విహార యాత్రలో వున్నారు. మహేష్ దంపతులు లెజెండరీ బిల్ గేట్స్‌ను కలిశారు. బిల్ గేట్స్‌కి పెద్ద అభిమాని అయిన మహేష్ బాబు ఆయన్ని కలసి థ్రిల్ అయ్యారు. ఫ్యాన్‌బాయ్‌గా మారి బిల్ గేట్స్ తో ఫోటో దిగారు.
“మిస్టర్ @ బిల్‌గేట్స్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది,. ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికులలో ఆయన ఒకరు… నిజమైన స్ఫూర్తి!!,” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. సర్కారు వారి పాటతో అలరించిన మహేష్ బాబు తదుపరి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాకి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వుండబోతుంది.