సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్లో ఉన్నాడు. మొన్నటిదాకా రెగ్యులర్ షూటింగ్ చేసిన మహేష్ సినిమాకి కొంత గ్యాప్ ఇచ్చి హాలీడేస్ లో ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ వేసొచ్చాడు. వచ్చి రాగానే మళ్లీ షూటింగ్ షురూ చేసేశాడనుకోండి. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ చేసే సినిమా దాదాపు మురుగదాస్ డైరక్షన్లో అని ఫిక్స్ అయినట్టే.. కమర్షియల్ పంథాలోనే సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఇవ్వడంలో మురుగదాస్ చాలా గొప్ప నైపుణ్యం ఉంది.
ఈసారి మహేష్ తో న్యాయ వ్యవస్థకు సంబంధించిన కథతో రంగంలో దిగుతున్నాడు మురుగదాస్. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేసేదుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే తెలుస్తున్న కథనాల ప్రకారం యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ఈ సినిమాను హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
కేవలం సౌత్ సినిమాలే చేసినా మహేష్ కు ఆల్ ఓవర్ ఇండియా మంచి మార్కెట్ ఉంది. ఇక ఓవర్సీస్ లో అయితే మహేష్ మొదటి స్థానంలోనే ఉంటాడు. మొన్నీమధ్య బాహుబలి వచ్చి ఓవర్సీస్లో బీట్ చేసింది కాని మహేష్ సినిమా అంటే మన దగ్గర ఎంత క్రేజో ఓవర్సీస్లో కూడా అంతే క్రేజ్. 2016 ఏప్రిల్ 12న ముహుర్తం పెట్టబోతున్న మహేష్ మురుగదాస్ సినిమాను పారస్ జైన్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్నారు. 80 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించబడుతుందని అంచనా. మరి సినిమాకు సంబంచిన మిగతా అప్ డేట్స్ మరి కొద్దిరోజుల్లో తెలియనున్నాయి.