సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు మురుగదాస్ తో కలిసి చేయబోయే సినిమాపై ఇప్పుడు ఆసక్తిగా ఉంది. విభిన్న కథా చిత్రాల నాయకుడిగా మహేష్ బాబుకి ఎంత పేరుందో.. కొత్త రకమైన కథలను తయారు చేయడంలో మురుగదాస్ ముందుటాడని మంచి పేరుంది. కొత్తదనాన్ని అందించడానికి ముందుండే ఈ ఇద్దరూ కలిసి చేయబోయే సినిమా కథ కూడా న్యాయ వ్యవస్థ మీద ఉంటుందని తెలిసిందే.
గతంలో ప్రభుత్వ వ్యవస్థ మీద అవినీతిని ప్రశ్నిస్తూ మురుగదాస్ తీసిన సినిమానే ఠాగూర్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా చిరంజీవి 150 వ సినిమాగా ఎంచుకున్న కత్తి కథ కూడా సామాజిక అంశం ప్రధానంగానే ఉంది. ఇప్పుడు మహేష్ బాబుతో మురుగదాస్ తీద్దామనుకుంటున్న సినిమా కూడా సామాజిక ప్రధానంగానే ఉందంటున్నారు.
భారతీయ న్యాయవ్యవస్థలో ఉన్న లోటుపాట్లు ప్రధాన అంశంగా ఈ కథ ఉండబోతోందట. చట్టంలో లొసుగులు, వాటిని ఆసరాగా చేసుకుని అవినీతిపరులు, నేరస్తులు ఎలా తప్పించుకుంటున్నారనే అంశం ప్రధానంగా ఈ సినిమా ఉండొచ్చంటున్నారు. దీనికి చట్టంతో పోరాటం అనే టైటిల్ అనుకున్నా.. ఇప్పుడు ఎనిమి అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మురుగదాస్ అకిరా, మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలతో చిత్రీకరణలో ఉన్నారు. ఈ సినిమాలు పూర్తీ చేసుకున్నాక వారిరువురు కలిసి రాబోయే సినిమాను ఏప్రిల్ లో మొదలు పెట్టనున్నారు. పారాస్ జైన్, ఠాగూర్ మధు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆషికి -2 హీరోయిన్ శ్రద్ధ కపూర్ ఒకే అయినట్టు సమాచారం.