సూపర్ స్టార్ మహేష్.. సూపర్ స్టార్ కృష్ణ నట ప్రస్థానన్ని కొనసాగిస్తూ.. టాలీవుడ్ నెంబర్ 1 హీరో అంటే ఆలోచించాల్సిన పనిలేకుండా అందరి మనసుల్లో మెదిలే మొదటి స్టార్ హీరో మహేష్.. తీసిన 21 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్, 4 సూపర్ హిట్, 2 హిట్ సినిమాలతో కెరియర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న మహేష్ టాలీవుడ్ అందమైన హీరోల్లో ఒకడు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు యాడ్స్ చేస్తూ టాలీవుడ్ లోనే కాకుండా నేషనల్ మార్కెట్ మీద కూడా పట్టు సాధించాడు.
దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాధించిన మహేష్ ‘వావ్’ మేగజైన్ ఈ నెల కవర్ పేజ్ మీద దర్శనమిచ్చాడు. బ్లాక్ జాకెట్ తో హాలీవుడ్ హీరోని తలపిస్తున్న మహేష్ టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా అతనికి సంబంధించిన విషయాలతో ఆర్టికల్ వచ్చింది. ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్లో ఉన్న మహేష్ ఆ తర్వాత చేయబోయే సినిమా మురుగదాస్ దర్శకత్వంలో అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకుగాను మహేష్ తీసుకునే పారితోషికం అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
పారాస్ జైన్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఆ సినిమాకు మహేష్ బాబుకి 25 కోట్ల దాకా ఇస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అదే నిజమైతే టాలీవుడ్ లోనే కాదు సౌత్ హీరోల్లో ఎక్కువ పాతితోషికం తీసుకుంటునే హీరోగా మహేష్ సంచలనం సృష్టించినట్టు అవుతుంది. మహేష్ ముఖ చిత్రంతో వచ్చిన ఈ నెల ‘వావ్’ మేగజైన్ ఈ సారి ఎక్కువ అమ్ముడవుతుందనడంలో సందేహం లేదనుకుంటా..!