స్పైడర్ ప్రిరిలీజ్ ఫంక్షన్ అభిమానుల కోలాహలం తో వాళ్ళ కేరింతల మధ్య ఘనంగా జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత, వాళ్ళ పిల్లలు ఇద్దరూ ఈ ఫంక్షన్ కి హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ ఫంక్షన్ లో మహేష్ ఆద్యంతం ఆనందంగా కనిపించారు. అది ఆయన మాటల్లోనూ కనిపించింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
“పోకిరి సమయం లో కలిసాను మురుగదాస్ ని. అప్పటి నుంచి అనుకుంటూ ఉంటే పదేళ్ళ తర్వాత ఇప్పటికి సాధ్యమైంది ఆయనతో సినిమా చేయడం. ఆయన ఈ కథ ని గంటన్నర సేపు చెప్పారు. అప్పుడాయన – సినిమా లో ఫోటొగ్రఫీ, స్క్రిప్ట్, థ్రిల్స్ అన్నీ ఎక్స్ట్రార్డినరీ గా ఉండాలి, ఆడియన్స్ స్టన్ అవ్వాలి అన్నారు. కానీ ఈరోజు డబ్బింగ్ చెప్తున్నపుడు చూస్తే ఆడియెన్స్ ఏంటి, నేనే స్టన్ అయ్యాను” అన్నారు. అలాగే మురుగదాస్ మీద మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత పర్ఫెక్ట్ గా ఒక బైలింగ్వల్ (ద్విభాషా చిత్రం) ని చేయడం మురుగదాస్ కే సాధ్యం అయింది. అంత ఎక్స్పీరియెన్స్డ్ డైరెక్టర్ కాబట్టే అంత చక్కగా తీయగలిగారు. మా అంత పర్ఫెక్ట్ గా ఒక బైలింగ్వల్ ని ఎవ్వరూ తీసి ఉండరేమో అన్నారు. మురుగదాస్ పదేళ్ళ క్రితం ఎంత సింపుల్ గా ఉన్నారో, ఇప్పుడు నేషనల్ డైరెక్టర్ అయ్యాక కూడా అంతే సింపుల్ గా ఉన్నారని ప్రశంసించారు .
చాలా గ్రాండ్ గా జరిగిన ఈ ఫంక్షన్ అభిమానులని ఆనందం లో ముంచెత్తడమే కాక సినిమా మీద హైప్ ని అమాంతం పెంచేసింది.