మహేష్‌బాబు – త్రివిక్రమ్.. వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా వచ్చాయి. ఆ సినిమాలు సాధించిన కమర్షియల్ విజయాల్ని పక్కన పెడితే – రెండింటి డీవీడీలూ అరిగిపోయే రేంజులో ఆయా సినిమాల్ని ఎంజాయ్ చేశారు మహేష్ అభిమానులు. ఇప్పుడు మళ్లీ వీళ్ల కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. అయితే…దానికి కొంచెం టైమ్ ఉంది. ముందు సర్కారు వారి పాట అవ్వాలి. ఆ తరవాతే.. త్రివిక్రమ్ తో సినిమా.
త్రివిక్రమ్ కూడా…. ముందుగా ఎన్టీఆర్ సినిమాని ఫినిష్ చేయాలి. ఆ తరవాతే.. మహేష్‌తో జట్టు కట్టొచ్చు. అయితే మహేష్ మాత్రం… తన సినిమా విషయంలో తొందర పెడుతున్నాడని టాక్. అక్టోబరు నాటికి.. సినిమా మొదలెట్టేయాలని త్రివిక్రమ్ కి టార్గెట్ ఫిక్స్ చేశాడట. అయితే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అప్పటికి పూర్తయ్యే ఛాన్సే లేదు. `సర్కారు వారి పాట` సంక్రాంతికి వస్తోంది. అయితే ముందుగా ఆ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసి బయటపడిపోదామనుకుంటున్నాడు మహేష్. త్రివిక్రమ్ సినిమా వీలైనంత వేగంగా పూర్తి చేసి రాజమౌళి సినిమా మొదలెట్టాలన్నది మహేష్ ఆలోచన. అయితే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కాంబో ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. అదెప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. అందుకే… మహేష్‌కి త్రివిక్రమ్ మాట ఇవ్వలేకపోతున్నాడట.