ఎక్కడ చూసినా బ్రహ్మోత్సవం సందడే. ప్రచారం పీక్స్‌కి వెళ్లిపోయింది. ఇంటర్వ్యూలూ, ప్రెస్ మీట్లూ, పెద్ద పెద్ద ఫ్లెక్సీలూ.. ఎక్కడ చూసినా బ్రహ్మోత్సవమే కనిపిస్తోంది. మహేష్ బాబు అడిగిన వాళ్లకీ, అడగని వాళ్లకూ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ఇది వరకు ప్రెస్ మీట్లకు తప్ప మీడియా ముందుకురాని మహేష్ గత కొన్నాళ్లుగా మారాడు. ముఖ్యంగా శ్రీమంతుడుకీ ఇంతే! ఇప్పుడు బ్రహ్మోత్సవం ప్రచారంలోనూ అంతే చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇక్కడో షాకింగ్ విషయం ఏమిటంటే మహేష్‌కి నాలుగు రోజుల నుంచీ జ్వరం. అయినా సరే.. ప్రమోషన్లు వదలడం లేదు.
తన సొంత సినిమా అనేసరికి మహేష్ ఇంత జాగ్రత్త తీసుకొంటున్నాడని, లేకపోతే అసలు సినిమానే పట్టించుకొనేవాడు కాదని ఓ వాదన వినిపిస్తోంది. కాకపోతే.. ప్రచారం విలువేంటో సినిమా వాళ్లు ఇప్పుడిప్పుడే తెలుసుకొంటున్నారు. బాహుబలి వసూళ్లలో మీడియాది కీలక పాత్ర. శ్రీమంతుడుకి మీడియా ఇచ్చిన హైప్ ఇంతా అంతా కాదు. దాన్ని వాడుకొంటే వసూళ్లు రాబట్టుకోవచ్చని సినిమావాళ్లు నమ్ముతున్నారు. జ్వరంలోనూ మహేష్ ఇంటర్వ్యూలు ఇచ్చాడంటే దానికి కారణం అదే.