టాలీవుడ్ లో నిన్న రాత్రి సంచలనం ఏమిటీ అంటే మహేష్ చేసిన ట్వీట్. నిజానికి తెరవెనుక వ్యవహారం లేకపోయి వుంటే మహేష్ స్పందించాల్సిన పని లేదు. ఎందుకంటే సుకుమార్-బన్నీ సినిమా ప్రకటన వచ్చింది కేవలం పీఆర్ టీమ్ నుంచి. అంతే తప్ప బన్నీ, సుకుమార్, మైత్రీ మూవీస్ నుంచి కాదు. అయితే మూడు గంటల తరువాత వచ్చిన ట్వీట్ సంగతి తెలిసి, అన్నీ విచారించి, సాయంత్రం ట్వీట్ వేసాడు మహేష్ బాబు. ఆ ట్వీట్ కూడా చిత్రంగా వుంది.
….
Due to creative differences, my film with Sukumar is not happening. I wish him all the best on the announcement of his new project. Respect always for a film maker par exellence. 1 Nenokkadine will remain as a cult classic. Enjoyed every moment working on that film.
…
All the best sir for your new film ??
ఇవీ మహేష్ వేసిన రెండు ట్వీట్ లు. వీటిని నిశితంగా పరిశీలిద్దాం. అసలు ఈ ట్వీట్ లలో ఎవరిన్నా ట్యాగ్ చేసారా? సుకుమార్ ను కానీ, మైత్రీ మూవీస్ ని కానీ ట్యాగ్ చేయలేదు. ఓ అనౌన్స్ మెంట్ ఇస్తున్నప్పుడు అయినా సంబంధిత ట్విట్టర్ ఐడిలు వున్నవారిని ట్యాగ్ చేయడం అన్నది కామన్ గా ట్విట్లలో చేసే పద్దతి. కానీ అలా మహేష్ చేయలేదు. కారణం ఊహించలేనిదేమీ కాదు. సుకుమార్, మైత్రీ మూవీస్ ట్వీట్ లు వేయలేదు. జస్ట్ పీఆర్ టీమ్ వేసింది. అందుకే మహేష్ కూడా అలా చేసాడనుకోవాలి. ఇదే చెబుతోంది మహేష్ ఎంత హర్ట్ అయ్యాడో?
అంతే కాదు. ఈ ప్రాజెక్టు చేయలేదు అని చెబితే సరిపోతుంది. పైగా అసలు ఈ ప్రాజెక్టు ఇంత వరకు అధికారికంగా ఫ్రకటించలేదు. అందువల్ల క్యాన్సిల్ అని చెప్పకున్నా ఫరవాలేదు. కానీ మహేష్ అక్కడితో ఆగకుండా సుకుమార్ ను సుతిమెత్తగా ఎత్తి పొడిచాడు. ఎలా?
వన్ సినిమా లాంటి కల్ట్ క్లాసిక్ ఇచ్చాడు అని చెప్పడం ద్వారా. వన్..నేనొక్కడినే కల్ట్ క్లాసిక్ గా మిగిలే వుంది అని చెప్పడం పొగడడం ఏమాత్రం కాదు. గొప్ప సినిమా తీసిచ్చావ్..ఆ గాయం ఇంకా అలాగే వుంది అని ఇన్ డైరక్ట్ గా చెప్పడం. మహేష్ ట్వీట్ కు ఫ్యాన్స్ రెస్పాండ్ అయిన తీరు ఇది చెపుతుంది.
వాళ్లంతా సుకుమార్ సినిమా వదిలేయడమే మంచిది అని కామెంట్ చేసారు. అంతే కాదు, అనిల్ రావిపూడి మీద పూర్తి నమ్మకంతొ, చాలా హుషారుతో వున్నారు ఫ్యాన్స్. మొత్తం మీద సుకుమార్ బన్నీ దగ్గరకు వెళ్లి మహేష్ ను హర్ట్ చేస్తే, మహేష్ తన ట్వీట్ తో వన్ సినిమాను గుర్తు చేసి సుకుమార్ ను హర్ట్ చేసాడనుకోవాలి.