త్రివిక్రమ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు, సెంటిమెంట్.. వీటి మధ్యలో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవన్నీ ఉంటాయి. త్రివిక్రమ్ సూపర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి… అలా వైకుంఠపురములో వరకూ ఆయన నమ్ముకొన్న ఫార్ములా అదే. ప్రస్తుతం ఆయన మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈనెలలోనే మొదలవుతుంది. ఈ సినిమాకి మాత్రం త్రివిక్రమ్ తన పంథాని పూర్తిగా మార్చేసినట్టు టాక్. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా అనే ఎపిసోడ్ ని పూర్తిగా పక్కన పెట్టేసి.. యాక్షన్ పై దృష్టి నిలిపారని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని, త్రివిక్రమ్ మార్క్ కుటుంబ సన్నివేశాలు ఏమాత్రం కనిపించబోవని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి త్రివిక్రమ్ మహేష్ కోసం ‘అతడు’ టైపు కథే సిద్ధం చేశాడు. అతడులో యాక్షన్ తో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయి. కానీ మహేష్ మాత్రం ఈసారి యాక్షన్‌పైనే ఫోకస్ చేయమని.. సలహా ఇచ్చాడట. దాంతో.. త్రివిక్రమ్ స్క్రిప్టులో కీలక మార్పులు చేశాడని, అందుకే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది. మహేష్ పుట్టిన రోజున ఈ సినిమాని మొదలెట్టాలనుకొన్నారు. కానీ గిల్డ్ బంద్ తో అది సాధ్యం కాలేదు. ఈ నెలాఖరుకి ఈ సినిమా క్లాప్ కొట్టుకోబోతోంది.