దర్యాప్తు సంస్థలను సెలబ్రిటిలు చాలా లైట్ తీసుకుంటున్నారు. విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై మహేష్ బాబు చాలా తీరికగా స్పందించారు. ఒక్క రోజు ముందు తనకు తాను విచారణకు రాలేనని షూటింగ్ ఉందని.. మరో రోజు కేటాయిస్తే కాల్ షీట్ గురించి ఆలోచిస్తానని సమాధానం పంపారు. దీంతో ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
సాయి సూర్య డెవలపర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందుకు మహేష్ బాబు రెండున్నర కోట్ల నగదుతో మొత్తం ఐదు కోట్ల 90 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నారు. నగదుగా అందుకున్న రెండున్నర కోట్ల వల్లే ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. అంత పెద్ద మొత్తాన్ని ఖాతాల్లో చూపించారా..లేదా అన్నదానిపై పూర్తి వివరాలు సేకరించనున్నారు. మహేష్ బాబు వ్యక్తిగతంగా చేసిన ఎండార్స్ మెంట్ కావడంతో ఈడీ అధికారులు ఆయననే పిలిచారు.
మహేష్ బాబు సెలబ్రిటీ కాబట్టి.. గడువు అడిగారు. ఈడీ అధికారులు మరో రోజు కేటాయించే అవకాశం ఉంది. అప్పుడు అయినా మహేష్ బాబు ఈడీ ఎదుట హాజరు కావాల్సిందే. ఒక్క సారి అయినా హాజరై.. ఆ నగదు గురించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.