సినిమా సినిమాకీ గ్యాప్ వస్తే.. ఫారెన్ చెక్కేయడం హీరోలకు అలవాటే. షూటింగ్ బడలికల మధ్య అదో రిలీఫ్. అయితే మహేష్ బాబు దారి వేరు. ఆయన షెడ్యూల్‌కీ షెడ్యూల్‌కీ మధ్య చిన్న గ్యాప్ వచ్చినా – ఫ్యామిలీకే టైమ్ కేటాయిస్తారు. వాళ్లతో పాటు ఓ షార్ట్ ట్రిప్ వేయడం అలవాటు. ఇప్పుడు ‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తి కావొచ్చింది. బుధవారంతో సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయినట్టే. ఆ వెంటనే మహేష్ ఫారెన్ చెక్కేస్తున్నాడు. అక్కడ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని మళ్లీ జనవరి 5న హైదరాబాద్ తిరిగొస్తాడు.
జనవరి 6న హైదరాబాద్ లో ‘గుంటూరుకారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాలు పంచుకోనున్నాడు. ఈ ఈవెంట్లోనే ట్రైలర్ విడుదల చేయాలా, లేదంటే ముందే వదిలేయాలా? అనే విషయంపై చిత్రబృందం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మరుసటి రోజు నుంచి జనవరి 12 వరకూ వరుసగా మహేష్ ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొనబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే 2 పాటలు వచ్చాయి. మూడో పాట జనవరి 1న విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ మాస్ పాట తెరకెక్కిస్తున్నారు. ఈ పాటలో చిత్రబృందం మొత్తం కనిపించనుంది. బుధవారంతో ఈ పాట పూర్తవుతుంది. దాంతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్టే.