త్రివిక్రమ్ సినిమాల్లో మాటలే కాదు పాటలు కూడా ఆయన స్టయిల్ లోనే వుంటాయి. పాటలు రాసే రచయితలకు ఆయన ఇచ్చే రిఫరెన్స్ పదాల్లో కనిపిస్తాయి. ప్రేమ, ఇష్టం, ఆనందం, సంతోషాన్ని వ్యక్తపరిచే సందర్భాల్లో వచ్చే పాటల్లో ఆయన ట్రేడ్ మార్క్ పదాలు, పోలికలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు గుంటూరు కారం నుంచి వచ్చిన రెండో సింగిల్ ఓ మై బేబీ పాట కూడా త్రివిక్రమ్ స్టయిల్ లోనే వుంది.
రామజోగయ్య శాస్త్రి ఈ పాటని రాశారు. సాహిత్యంలో రామజోగయ్య మార్క్ తో పాటు త్రివిక్రమ్ రిఫరెన్స్ లో మెండుగా కనిపించాయి.
”నా కాఫీ కప్పులో షుగర్ క్యూబు నువ్వే నువ్వే
నా కంటి రెప్పలో కాటుకు ముగ్గు నువ్వేనువ్వే
నా చెంపలకంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే
నా ఊపిరి గాలిని పెర్ఫ్యుమల్లె చుట్టేస్తావే.. ఇలా సాగింది పాట సాహిత్యం.
అయితే చరణం లో కొన్ని గమ్మత్తయిన పోలికలు వినిపించాయి. చున్నీతో టై కట్టడం, పిల్లో పక్కన నవల, వేకప్ కాల్ వెచ్చగ తాకే సూరీడు, బాల్కనీ గోడలు దూకే వెచ్చటి చంద్రుడు.. ఇవన్నీ త్రివికమ్ మార్క్ పోలికలని ఆయన పాటలని లోతుగా పరిశీలించినవారికి అర్ధమైపోతుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఆకట్టుకునే లైన్ కూడా వుంది. ”ఏ నూటికో కోటికో పుట్టిన ‘ఒక్కడు’ నువ్వేలే.. ఈ లైన్ లో ‘ఒక్కడు’ సినిమా టైటిల్ ఫాంట్ కూడా వేశారు. తమన్ క్యాచి ట్యూన్ అయితే ఇవ్వగలిగాడు. మరి పాట ఏ స్థాయిలో వైరల్ అవుతుందో చూడాలి.